ఎన్డీయే కూటమి నేతల కీలక సమావేశం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ఎంపిక చేసిన ప్రధాన అంశాలు, ఎన్డీఏ భవిష్యత్తు లక్ష్యాలపై చర్చ జరుగనుంది. ఈ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా హాజరుకానున్నారు.
ప్రతీ సంవత్సరం మామూలుగా జరిగే ఈ సమావేశం, ప్రత్యేకంగా ఈ సారి బాబా సాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వివాదస్పద వ్యాఖ్యలతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. దీనితో, ఈ సమావేశం దేశవ్యాప్తంగా ప్రధాన చర్చగా మారింది.
బిల్లులపై చర్చ
ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు ప్రతిష్టాత్మక బిల్లులపై కూడా చర్చ జరగవచ్చని వార్తలు వస్తున్నాయి. వక్ఫ్ సవరణ బిల్లు, వన్ నేషన్ వన్ ఎలక్షన్, 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ జగరవచ్చని తెలుస్తోంది. ఈ చర్చల ద్వారా, ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల మధ్య మరింత సమన్వయం సాధించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి.