ప్రముఖ నటుడు ఫహాద్ ఫాజిల్ అటెన్షన్ డెఫిసిట్ హైపరాక్టివిటీ డిజార్డర్ (ADHD) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు గతంలో వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఫహాద్ భార్య నజ్రియా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. “ఆయన పరిస్థితిని అర్థం చేసుకోవడం నాకు మొదట కష్టమైంది. కానీ, ఆ తర్వాత ఓపిక పెంచుకుని, అతనికి మద్దతుగా ఉండడం నేర్చుకున్నాను. ఈ వ్యాధి ఉన్నప్పటికీ, మా జీవితంలో పెద్దగా ఏ మార్పులు లేవు” అని నజ్రియా పేర్కొన్నారు.
ADHD అనేది ఏమిటి?
ఈ వ్యాధి బాధితులకు పరధ్యానం, కోపం, చికాకు వంటి లక్షణాలు ఉంటాయి. చిన్న విషయాలకే ఆవేశపడటం లేదా ప్రతిసారీ చురుకుదనం చూపడం వంటివి సాధారణ లక్షణాలు. ఈ వ్యాధిని సమర్థవంతంగా జయించడానికి కుటుంబ సభ్యుల మద్దతు కీలకం. ఫహాద్ తన నటన ద్వారా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నప్పటికీ, వ్యక్తిగతంగా ఈ వ్యాధితో పోరాడుతున్నట్లు వెల్లడించిన నజ్రియా మాటలు ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా నిలిచాయి.