నయనతారకు మరో లీగల్ నోటీస్‌

నయనతారకు మరో లీగల్ నోటీస్‌

లేడీ సూపర్ స్టార్ నయనతార తన డాక్యుమెంటరీ నయనతార ‘బియాండ్ ది ఫెయిరీ టేల్’ కారణంగా కొత్త చిక్కుల్లో పడింది. ధనుష్ రూ.10 కోట్ల పరిహారం డిమాండ్ చేసిన కేసు ఇంకా సద్దుమణగకముందే, ఇప్పుడు చంద్రముఖి నిర్మాతలు నయనతారకు లీగల్ నోటీసులు జారీ చేశారు.

చంద్రముఖి క్లిప్పింగ్స్‌పై వివాదం
చంద్రముఖి నిర్మాతలు నయనతార, నెట్‌ఫ్లిక్స్‌కు నోటీసులు పంపారు. డాక్యుమెంటరీలో అనుమతి లేకుండా చంద్రముఖి చిత్రంలోని కొన్ని క్లిప్పింగ్స్ ఉపయోగించారంటూ ఆరోపణలు చేశారు. ఈ క్లిప్పింగ్స్ కారణంగా రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే, ఇప్పటివరకు నయనతార ఈ విషయంపై స్పందించలేదు.

ధనుష్-నయనతార మధ్య కోర్టు కేసు
ఇప్పటికే నయనతార డాక్యుమెంటరీలో ‘నేనూ రౌడీనే’ మూవీలోని 3 సెకన్ల వీడియో క్లిప్‌ను అనుమతి లేకుండా వాడారని ధనుష్ రూ.10 కోట్లకు దావా వేశారు. ఈ కేసు తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నయనతార బహిరంగ లేఖలో ధనుష్‌పై విమర్శలు చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది.

Join WhatsApp

Join Now

Leave a Comment