యావత్ తెలంగాణ (Telangana) ఉత్కంఠగా ఎదురుచూసిన జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నిక (By-Election) ఓట్ల లెక్కింపు కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం (Kotha (Vijaya Bhaskar Reddy Stadium)లో కొనసాగుతోంది. 10 రౌండ్లు, 42 టేబుల్స్‌లో జరుగుతున్న కౌంటింగ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తిరుగులేని భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. మధ్యాహ్నం నాటికి, 8వ రౌండ్ ముగిసేసరికి నవీన్ యాదవ్‌కు ఏకంగా 21,495 ఓట్ల భారీ మెజారిటీ లభించింది.
ఏడో రౌండ్లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థికి 4,030 ఓట్ల లీడ్ రావడంతో, నవీన్ యాదవ్ విజయం దాదాపుగా ఖరారైంది. దీంతో గాంధీభవన్‌లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు మొదలుపెట్టాయి. ఈ విజయంపై స్పందించిన సీనియర్ నాయకుడు వీహెచ్, ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నమ్మారని, దివంగత పి. జనార్దన్‌రెడ్డి వారసుడిగా నవీన్ యాదవ్ అభివృద్ధి చేస్తాడని విశ్వసించారని పేర్కొన్నారు.
ఈ ఉప ఎన్నికల ఫలితం వెనుక కాంగ్రెస్ మంత్రుల కృషి స్పష్టంగా కనిపించింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి (రహమత్ నగర్), తుమ్మల నాగేశ్వరరావు (వెంగల్రావు నగర్), దామోదర రాజనర్సింహా (ఎర్రగడ్డ), ఉత్తమ్‌కుమార్ రెడ్డి (యూసఫ్‌గూడ) తమకు అప్పగించిన డివిజన్లలో కాంగ్రెస్‌కు అత్యధిక మెజారిటీని తెచ్చిపెట్టారు. కేవలం రెండు రౌండ్లు మాత్రమే మిగిలి ఉండటంతో, నవీన్ యాదవ్ త్వరలోనే అధికారికంగా విజయం ప్రకటించుకునే అవకాశం.








