14 రోజులు కోమాలో హీరో విజయ్‌ పేరు కలవరించిన నాజ‌ర్ కొడుకు

14 రోజులు కోమాలో హీరో విజయ్‌ పేరు కలవరించిన నాజ‌ర్ కొడుకు

త‌న కొడుకు కోమాలో ఉన్న‌ప్పుడు ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న జ‌రిగింద‌ని ప్ర‌ముఖ న‌టుడు నాజ‌ర్ తెలిపారు. ఘోర‌ రోడ్డు ప్రమాదంలో జరిగి 14 రోజులు నాజర్‌ కుమారుడు నూరుల్‌ హసన్‌ ఫైజల్‌ కోమాలో ఉన్నారు. ఆ సమయంలో, తన‌కు దగ్గరగా ఉన్న వారిని అమ్మ, నాన్నలను గుర్తించకపోయినప్పటికీ, ఒక స్టార్‌ హీరో పేరు మాత్రం తలచుకున్నాడని నాజర్‌ తన ఇంటర్వ్యూలో చెప్పారు.

ఫైజల్‌ కోమాలో నుంచి బయటపడి, ఆ సమయంలో తనకు గుర్తొచ్చింది ఒకే పేరు విజయ్‌ (Vijay). అతడు కోమాలో ఉన్నప్పుడు, అతని స్నేహితుడు విజయ్‌ కుమార్‌ కూడా యాక్సిడెంట్‌లో ఉన్నాడు. అందువల్ల, విజయ్‌ కుమార్‌ పేరును తలచుకున్నాడేమో అని అనుకున్నా, కానీ, అత‌ను విజయ్‌ కుమార్‌ను చూస్తున్నప్పుడు కూడా గుర్తుపట్టలేకపోయాడు. త‌న కుమారుడు త‌లుచుకుంది హీరో విజ‌య్‌ని అని త‌రువాత తెలిసింద‌న్నారు.

విజయ్‌ సినిమాలు, పాటలతో కోలుకునే మార్గం
ఈ సమయంలో నాజర్‌ భార్య ఒక సైకాలజిస్ట్‌గా ఆమె కుమారుడి కోలుకోవడానికి విజయ్‌ సినిమాలు, పాటలు చూపించామని చెప్పారు. అదే సమయంలో, హీరో విజయ్‌ కూడా ఆస్పత్రికి వచ్చి ఫైజల్‌ను పలుమార్లు కలిశాడు. ఫైజల్‌కు సంగీతం అంటే ఇష్టం అని తెలుసుకుని, ఆయన గిటార్‌ను బహుమతిగా ఇచ్చారు. ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ విజయ్‌ మా మనసుల్లో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది నాజర్‌ అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment