బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీపై నారా రోహిత్ కీలక వ్యాఖ్యలు

బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీపై నారా రోహిత్ కీలక వ్యాఖ్యలు

తాను నటించిన ‘సుందరకాండ’ సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడిన నారా రోహిత్‌ని మోక్షజ్ఞ సినీ ప్రవేశం గురించి ప్రశ్నించారు. దీనికి స్పందిస్తూ రోహిత్, “నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ ఈ సంవత్సరం చివరిలో లేదా వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఉండవచ్చు” అని తెలిపారు.

మోక్షజ్ఞ తన తొలి సినిమా కోసం ఎలాంటి కథను ఎంచుకుంటున్నాడనే దానిపై కూడా రోహిత్ మాట్లాడారు. “మోక్షజ్ఞ ఒక ప్రేమ కథా చిత్రంతో అరంగేట్రం చేయాలనుకుంటున్నట్లు నాతో చెప్పాడు. అందుకే అలాంటి మంచి కథ కోసం చూస్తున్నాడు” అని నారా రోహిత్ వెల్లడించారు.

గతేడాది ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైనప్పటికీ, ఆ ప్రాజెక్ట్ అనుకోకుండా ఆగిపోయింది. ఆ తర్వాత పలువురు దర్శకుల పేర్లు వినిపించినా ఏదీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు నారా రోహిత్ చేసిన ఈ వ్యాఖ్యలు నందమూరి అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయని చెప్పవచ్చు.

Join WhatsApp

Join Now

Leave a Comment