విజయ్ కనకమేడల దర్శకత్వంలో బెల్లకొండ సాయిశ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘భైరవం’ టీజర్ ఇటీవలే విడుదలైంది. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నారా రోహిత్ ప్రత్యేకంగా పాల్గొని, తన సహనటుడు మంచు మనోజ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “మంచు మనోజ్‌తో నాకు చిన్నతనంలోనే పరిచయం ఏర్పడింది. ‘భైరవం’ సినిమా మాకు ఆ అనుబంధాన్ని మరింత గాఢంగా మార్చింది” అని చెప్పారు. మనోజ్ తనకు బ్రదర్‌తో సమానమని, ఏం కావాలన్నా తన పక్కనే ఉంటాడన్నారు రోహిత్. ఆయన మాటలు ఈ ఇద్దరి స్నేహం ఎంతబలంగా ఉందో తెలిపింది.
కాగా, ఇటీవల మంచు ఫ్యామిలీ వివాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. తిరుపతి ఎంబీయూ పర్యటనకు వచ్చిన మంచు మనోజ్ దంపతులు.. నారావారిపల్లెకు చేరుకొని మంత్రి నారా లోకేశ్‌తో సమావేశమైన విషయం తెలిసిందే.