నారా రోహిత్ – శిరీషల వివాహం

నారా రోహిత్ – శిరీషల వివాహం

టాలీవుడ్ యువ కథానాయకుడు నారా రోహిత్ తన ప్రేయసి శిరీషను వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. గతేడాది అక్టోబర్‌లో నిశ్చితార్థం జరిగిన ఈ జంట, సరిగ్గా ఏడాది తర్వాత వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య మూడు ముళ్లు వేసుకుని ఒక్కటయ్యారు. పల్నాడు జిల్లాలోని రెంటచింతల స్వస్థలం అయిన శిరీష ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యను పూర్తి చేసి, నటనపై ఆసక్తితో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. నారా రోహిత్ నటించిన ‘ప్రతినిధి-2’ సినిమాలో ప్రియురాలి పాత్ర పోషించిన సమయంలోనే వీరిద్దరూ ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది.

ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై సందడి చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఆయన సతీమణి భువనేశ్వరి దగ్గరుండి అన్ని కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఐటీ మంత్రి నారా లోకేష్ దంపతులు, నందమూరి హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దంపతులు నూతన దంపతులను ఆశీర్వదించారు. వీరితో పాటు యంగ్ హీరోలు మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, శ్రీ విష్ణు తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను దీవించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment