ప్రధాని (Prime Minister) నరేంద్ర మోడీ (Narendra Modi)ని ఏపీ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకారం అందించాలని కోరుతూ పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడుల సాధనకు ప్రధానమంత్రి సహకారం అవసరమని లోకేష్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకించి, రాష్ట్రానికి సెమీ కండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఐటీ(IT), ఎలక్ట్రానిక్స్ (Electronics) పరిశ్రమల స్థాపనకు మరింత చేయూత అందించాలని కోరారు. యోగాంధ్ర (Yogandra) నిర్వహణపై రూపొందించిన కాపీ టేబుల్ బుక్‌ను బహుకరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, రాష్ట్ర అభివృద్ధికి అన్నివిధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లుగా సమాచారం.
I had the privilege of calling on Hon’ble Prime Minister Shri Narendra Modi ji today. I conveyed gratitude for the recent GST rationalisation, a landmark step that will energise MSMEs and ease the burden on the middle class. I also thanked him for the Government of India’s… pic.twitter.com/13wE9OK912
— Lokesh Nara (@naralokesh) September 5, 2025