---Advertisement---

హీరో నాని ‘హిట్-3’ షూటింగ్‌లో విషాదం.. అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ మృతి

హీరో నాని 'హిట్-3' షూటింగ్‌లో విషాదం.. అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ మృతి
---Advertisement---

టాలీవుడ్ యంగ్ హీరో నాని (Hero Nani) నటిస్తున్న “హిట్-3” (Hit-3) సినిమా షూటింగ్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ భాగంగా శ్రీనగర్ (Sri Nagar)లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే, ఈ క్రమంలో అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్న KR క్రిష్ణ (KR Krishna) అనే మహిళకు హార్ట్ ఎటాక్ వచ్చింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్ప‌త్రికి తరలించినప్పటికీ, ఆమె చికిత్స పొందుతూ మృతిచెందింది.

ఈ విషాద ఘటనతో చిత్ర యూనిట్ మొత్తం షాక్‌కు గురైంది. శ్రీ నగర్‌లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్న నేపథ్యంలో ఈ ఘటన జరిగి ఉండవచ్చని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఆవేదన వ్యక్తం చేస్తూ, సినిమా షూటింగ్ వారం రోజులపాటు నిలిచిపోయినట్లు సమాచారం. “హిట్-3” చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు, ఈ సినిమాకు ముందు వచ్చిన రెండు పార్టులు కూడా భారీ విజయాలను సాధించిన విషయం తెలిసిందే.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment