నేచురల్ స్టార్ నాని ( Natural Star Nani) హీరోగా, శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్ (The Paradise)’ విడుదలపై కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాను వచ్చే ఏడాది సరిగ్గా ఇదే రోజు విడుదల చేస్తున్నట్లుగా మేయర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్యారడైజ్ మూవీ విడుదలకు ఇంకా 365 రోజులు మాత్రమే ఉండటంతో నాని ఈ విషయాన్ని ఓ స్పెషల్ పోస్టర్‌తో ప్రకటించారు. ఎక్స్(Twitter)లో కౌంట్‌డౌన్ పోస్టర్‌ను షేర్ చేసిన నాని, అభిమానులను మరోసారి ఉత్కంఠకు గురిచేశారు.
ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఈ చిత్రానికి అనిరుధ్ (Anirudh) మ్యూజిక్ అందిస్తున్నారు. నేచురల్ స్టార్ నాని-శ్రీకాంత్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘దసరా (Dasara)’ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడున్న హైప్ చూస్తుంటే, ‘ది ప్యారడైజ్’ కూడా మరో విజయాన్ని అందుకునే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
365 Days/రోజులు.#TheParadise pic.twitter.com/jITmj1Cq9e
— Nani (@NameisNani) March 26, 2025