టాలీవుడ్ నేచురల్ స్టార్ (Natural Star) నాని(Nani) హీరోగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్వకత్వంలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సినిమా (Paradise Movie) విశేషమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటివరకు నాని చేసిన సినిమాలకంటే భిన్నంగా, గ్లోబల్ స్థాయిలో నిర్మాణం జరగడం వల్ల ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవలం భారతీయ ప్రేక్షకులకే కాకుండా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించుకుంది.
హాలీవుడ్ టచ్‌తో ప్రత్యేకత..
ఈ చిత్రానికి హాలీవుడ్ టచ్‌ను జోడించేందుకు యూనిట్ కసరత్తులు ప్రారంభించింది. అవతార్ వంటి భారీ సినిమాలకు మార్కెటింగ్ చేసిన హాలీవుడ్ ఏజెన్సీ కనెక్ట్ (Connect Mobscene) మోబ్సీన్‌తో ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. అంతేకాకుండా, సినిమాలో ఓ హాలీవుడ్ నటుడిని కూడా తీసుకోవాలని యూనిట్ భావిస్తోంది. దీంతో ఈ చిత్రం మరింతగా ఇంటర్నేషనల్ రేంజ్‌లో నిలుస్తుందని టీమ్ నమ్ముతోంది.
నాని కెరీర్‌లో మైలురాయిగా నిలిచే ది ప్యారడైజ్ వచ్చే ఏడాది మార్చి 26, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా నాని హాలీవుడ్ వైపు తొలి అడుగులు వేస్తున్నాడనే అంచనాలు ఫ్యాన్స్‌లో ఊపిరి పీల్చిస్తున్నాయి.








