ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ (Heavy) వర్షాల కారణంగా నల్లగొండ (Nalgonda) జిల్లాలోని నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టులోని మొత్తం 26 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం, 8 గేట్లను ఎత్తి 2,60,344 క్యూసెక్కు (Cusecs)ల నీటిని దిగువకు వదులుతున్నారు.
ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2,52,840 క్యూసెక్కుల వరద వస్తుండగా, దిగువకు 2,92,826 క్యూసెక్కుల నీరు వెళ్తోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ఇప్పుడు 588.40 అడుగుల నీటిమట్టం నమోదైంది. అలాగే, గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలకుగాను, ప్రస్తుతం 307.2834 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
శ్రీశైలంకు వరద ఉద్ధృతి
నాగార్జున సాగర్‌తో పాటు శ్రీశైలం (Srisailam) ప్రాజెక్టుకు కూడా భారీగా వరద వస్తోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 11,74,221 క్యూసెక్కుల వరద వస్తున్నందున అధికారులు ఏడు క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,87,208 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ అదనంగా 65,632 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 882.10 అడుగులు, మరియు నీటి నిల్వ సామర్థ్యం 199.2737 టీఎంసీలుగా నమోదైంది.








