టాలీవుడ్‌లో మరో సెన్సేషనల్ కాంబినేషన్ రాబోతోందా? ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, అక్కినేని నాగార్జున కోసం ఓ కథ సిద్ధం చేసినట్లు సమాచారం.
సినీ వర్గాల సమాచారం ప్రకారం, పూరీ చెప్పిన కథ నాగార్జునకు బాగా నచ్చిందట. ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కలయికలో “శివమణి” (2003), “సూపర్” (2005) వంటి హిట్ చిత్రాలు వచ్చాయి.
ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అవుతుందా? పూరీ తన స్టైల్ మాస్ మసాలా సినిమాతో నాగ్‌ను కొత్త అవతారంలో చూపిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!