రాజమండ్రి (Rajahmundry) ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి (Naganjali) ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు (Sensational Facts) బయటకు వచ్చాయి. నాగాంజలి మృతికి కారణమైన నిందితుడు దీపక్ (Deepak) రిమాండ్ రిపోర్టు (Remand Report)లో కీలక అంశాలు పోలీసులు ప్రస్తావించారు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి యువతిని లోబర్చుకొని ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు దీపక్ అంగీకరించాడు. దీపక్ మాటలను నాగాంజలి అమాయకంగా (Innocently) నమ్మింది. కొన్ని రోజుల తరువాత వివాహం (Marriage) చేసుకోవాలని నాగాంజలి పట్టుపట్టడంతో దీపక్ కనికరం లేకుండా ఆమెను చెప్పుతో కొట్టాడని (Beat with a Slipper) సమాచారం.
నిందితుడు దీపక్ అకృత్యాలను నాగాంజలి తన తండ్రికి, రూమ్మెట్లకు సైతం తెలియనివ్వకుండా జాగ్రత్తపడింది. ఈనెల 23న దీపక్‌కు కాల్ చేసి పెళ్లి చేసుకోవాలని కోరగా, చస్తే చావు.. పెళ్లి మాత్రం చేసుకోనని తెగేసి చెప్పడంతో తాను మోసపోయినట్టు గ్రహించిన నాగాంజలి తీవ్ర మానసిక వేధనకు గురైంది. దీపక్ తనను మోసం చేయడంతో నాగాంజలి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కాగా, నిందితుడు దీపక్‌కు ఇంతకు ముందే పెళ్లయి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం నిందితుడు దీపక్ పోలీస్ రిమాండ్‌లో ఉన్నాడు.