టాలీవుడ్ యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన భార్య శోభిత ధూళిపాళతో కలిసి గడిపే చిన్న చిన్న క్షణాలను ఎలా ప్రత్యేకంగా మలచుకుంటారో వివరించారు. “శోభిత పుస్తకాలను ఎంతో ఇష్టపడతారు. మేమిద్దరం హైదరాబాద్లో ఉన్నప్పుడు, ఉదయం, రాత్రి కలిసి భోజనం చేయాలనే ఒక చిన్న నియమాన్ని పెట్టుకున్నాం. ఇది మా బంధాన్ని బలపరిచే ఒక చిన్న ప్రయత్నం” అని చైతు అన్నారు. ఈ సాధారణ అలవాటు తమ సంబంధానికి బలాన్ని ఇస్తుందని ఆయన చెప్పారు.
చైతన్య తమ జీవితంలో చిన్న క్షణాలను ఎలా ఆనందమయంగా మార్చుకుంటారో వెల్లడించారు. “మేము మూవీ నైట్ ప్లాన్ చేసుకోవడం, షికారుకు వెళ్లడం, ఫేవరిట్ ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం లేదా ఇంట్లోనే వండుకోవడం వంటివి చేస్తాం. ఈ చిన్న క్షణాలను ప్రత్యేకంగా మలచుకుంటాం” అని ఆయన వివరించారు. అలాగే “హాలిడేలను ప్లాన్ చేసుకుంటూ గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకాలను సృష్టిస్తాం” అని చెప్పారు. ఈ విధంగా, సాధారణ జీవితంలోని ఆనందాలను మధురమైన జ్ఞాపకాలుగా మార్చుకోవడమే తమ జీవనశైలి అని చైతన్య స్పష్టం చేశారు.