---Advertisement---

నాగచైతన్య మ‌రో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్!

నాగచైతన్య భారీ బడ్జెట్ ప్రాజెక్ట్!
---Advertisement---

యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య క్రేజీ ప్రాజెక్టుకు ఓకే చెప్పార‌ని టాలీవుడ్ కాంపౌండ్ నుంచి వార్త‌లు వినిపిస్తున్నాయి. నాగచైతన్య ప్రస్తుతం తన కొత్త సినిమా ‘తాండేల్’ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ బాహుబ‌లి లాంటి పాన్ ఇండియా సినిమాను నిర్మించిన ఆర్కా మీడియా నాగ‌చైత‌న్య‌తో ఓ క్రేజీ ప్రాజెక్టును నిర్మించ‌నుంద‌ని తెలుస్తోంది.

ఈ ప్రాజెక్ట్ హారర్ కామెడీ జోనర్‌లో ఉంటుందని, దర్శకుడు కార్తీక్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం. వ‌చ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా బ‌డ్జెట్ రూ.150 కోట్లు ఉంటుంద‌ని, కేవ‌లం విజువ‌ల్ ఎఫెక్ట్స్ కోస‌మే భారీ మొత్తంలో ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రాజెక్ట్‌పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

నాగచైతన్య కొత్త తరహా కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు. హారర్, కామెడీ జోనర్‌లో చైతూ ఏ విధంగా అల‌రించ‌నున్నారో చూడాలని సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment