నటుడు నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో వీరిద్దరూ స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న నాగచైతన్య, శోభితలకు అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వారికి పండితులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. వీరిద్దరూ కలిసి తిరుమల దర్శనానికి వచ్చిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నాగచైతన్య కెరీర్ అప్‌డేట్స్:
ప్రస్తుతం నాగచైతన్య ‘తండేల్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తుది దశలో ఉంది. ఈ సినిమాతో ఆయన ఈ ఏడాది చివరికల్లా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా, నాగచైతన్య దర్శకుడు కార్తీక్ వర్మతో కలిసి ఒక సూపర్ నేచురల్ హారర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.







