తెలంగాణ బీజేపీ (Telangana BJP) కొత్త అధ్యక్షుడి(New President)గా ఏబీవీపీ (ABVP) సీనియర్ నాయకులు, ప్రముఖ న్యాయవాది, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు (N. Ramachander Rao) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన కాసేపట్లో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న జి. కిషన్ రెడ్డి (G. Kishan Reddy) స్థానంలో ఆయన నియమితులవుతున్నారు. మన్నగూడ (Mannaguda)లో జరిగే సన్మాన సభలో సంస్థాగత ఎన్నికల అధికారి శోభ కరండ్లాజే (Shobha Karandlaje) రాంచందర్ రావు (Ramachander Rao)ను అధ్యక్షుడిగా అధికారికంగా ప్రకటించారు.
బాధ్యతలు స్వీకరణ, కీలక నేతల హాజరు
మన్నేడలో ఏర్పాటు చేసిన సన్మాన సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. వీరితో పాటు తెలంగాణలోని కీలక బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు హాజరయ్యారు.
ర్యాలీగా కార్యకర్తలతో కలిసి వేద కన్వెన్షన్‌కు చేరుకున్న నూతన అధ్యక్షుడు రాంచందర్ రావుకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఘన స్వాగతం పలికారు. నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలియజేశారు. సంస్థాగత ఎన్నికల అధికారి శోభ కరండ్లాజే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్ రావును ప్రకటించడంతో సభలో హర్షం వ్యక్తమైంది.
ఆంధ్రప్రదేశ్‌కు కొత్త అధ్యక్షుడు
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న మాధవ్.. గతంలో శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేవైఎంలో కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు.








