దారుణం.. ప్రియురాలి నోటిలో డిటోనేటర్ పెట్టి పేల్చి హత్య

దారుణం.. ప్రియురాలి నోటిలో డిటోనేటర్ పెట్టి పేల్చి హత్య

ప్రియురాలిని (Lover) హోట‌ల్‌ (Hotel)కు తీసుకెళ్లి, గ‌దిలో బంధించి నోట్లో (Mouth) డిటోనేట‌ర్ (Detonator) పెట్టి పేల్చి (Exploded) హ‌త్య (Murder) చేసిన అతి దారుణ‌మైన సంఘ‌ట‌న కర్ణాటక (Karnataka) రాష్ట్రం మైసూరు (Mysuru) జిల్లాలోని సలిగ్రామ్ ప్రాంతంలో వెలుగుచూసింది. పెళ్ల‌యి కూతురు ఉన్నా.. పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేయడంతో సిద్ధరాజు దారుణానికి ఒడిగ‌ట్టాడని తెలుస్తోంది.

వివ‌రాల్లోకి వెళితే.. సలిగ్రామ్ (Saligram) ప్రాంతానికి చెందిన సిద్ధరాజు (Siddaraju) అనే యువకుడితో ద‌ర్శిత (22) ప్రేమలో పడింది. ఇద్దరూ శారీరకంగా దగ్గరవ్వగా.. దర్శిత పెళ్లి చేసుకుందామని చెప్పడంతో సిద్ధ‌రాజు సాకులు చెప్పి దాటవేస్తూ వ‌చ్చాడు. ఇంతలో ద‌ర్శిత త‌ల్లిదండ్రులు కేరళకు చెందిన సుభాష్ అనే వ్యక్తితో యువ‌తికి పెళ్లి చేశారు. సుభాష్‌-ద‌ర్శిత (Subhash-Darshitha) దంప‌తుల‌కు ఒక కూతురు పుట్టింది. వృత్తిరీత్యా భ‌ర్త సుభాష్ దుబాయ్‌కి వెళ్ళిపోగానే, ప్రియుడు సిద్ధరాజుకు దర్శిత ద‌గ్గ‌రైంది.

భర్తతో ఉండలేకపోతున్నానని, కూతురితో వచ్చేస్తానని దర్శిత బలవంతం చేయడంతో.. ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ వేసిన సిద్ధరాజు.. ద‌ర్శిత‌ను హోట‌ల్‌కు తీసుకెళ్లి బంధించాడు. ఆమెను అక్కడ తీవ్రంగా కొట్టి నోటిలో డిటోనేటర్ పెట్టి పేల్చేశాడు. క్షణాల్లోనే ఆమె ముఖం చిద్రమైపోయి గుర్తుపట్టలేని స్థితిలో అక్కడికక్కడే మృతి చెందింది. రెండు రోజులుగా దర్శిత కనిపించడం లేదని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, హోటల్ సిబ్బంది గుర్తుతెలియని మృతదేహం ఉందని సమాచారం ఇచ్చారు.

ప్రారంభ విచారణలో సెల్‌ఫోన్ ఛార్జింగ్ పేలడంతో దర్శిత చనిపోయిందని సిద్ధరాజు అబద్ధం చెప్పాడు. అయితే పోలీసులు తనదైన శైలిలో విచారణ జరపడంతో చివరికి అసలు నిజం బయటపడింది. తాను ఉద్దేశపూర్వకంగా హత్య చేసినట్టు సిద్ధరాజు ఒప్పుకున్నాడు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ప్రియురాలి నోటిలో డిటోనేటర్ పెట్టి క్రూరంగా హతమార్చిన సిద్ధరాజును పోలీసులు అరెస్టు చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment