భూకంపాలు (Earthquakes) మయన్మార్ (Myanmar) ను వణికిస్తున్నాయి. గత మూడు రోజులుగా అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ భూమి కంపిస్తుందోనన్న టెన్షన్ మయన్మార్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా మయన్మార్‌లో మరో భూకంపం (Another Earthquake) నమోదైంది. భూమి మళ్లీ కంపించడంతో ప్రజలంతా వీధుల్లో పరుగులు పెట్టారు. రిక్టర్ స్కేల్‌పై 5.1 తీవ్రత నమోదు కావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు (Rushed Out).
ఇప్పటికే శుక్రవారం 7.7 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం 1600 మందికిపైగా ప్రాణాలు కబళించింది. వరుస భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ, తరచూ ప్రకంపనలు రావడంతో జనాలు భద్రత కోసం సురక్షిత ప్రదేశాలకు తరలిపోతున్నారు.








