మయన్మార్, బ్యాంకాక్‌లో భారీ భూకంపం.. కుప్ప‌కూలిన భవనాలు (Videos)

మయన్మార్, బ్యాంకాక్‌లో భారీ భూకంపం.. కుప్ప‌కూలిన భవనాలు (Videos)

మయన్మార్(Myanmar), థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌(Bangkok)లో భారీ భూకంపం(Earthquake) సంభవించింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో విశాల భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి(Building Collapse). 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభ‌వించింది. ఈ ప్రకంపనలతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆఫీసులు, షాపులు, రహదారుల మీద పరుగులు తీస్తున్న ప్రజల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్(Viral Videos) అవుతున్నాయి. భారీ స్థాయిలో భూమి కంపించిన‌ప్ప‌టికీ సునామీ వచ్చే ప్రమాదం లేదని అధికారులు స్పష్టంచేశారు.

సహాయక చర్యలు ముమ్మరం
భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భవనాలు కూలిపోవడంతో, సహాయక బృందాలు తక్షణమే రంగంలోకి దిగాయి. మంటలు చెలరేగిన చోట్ల అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు. ప్రాణ నష్టంపై ఇంకా పూర్తి సమాచారం అందాల్సి ఉంది. భారీ భూకంపానికి సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment