సినిమా కోసం 50 రోజులు స్నానం చేయలేదట!

సినిమా కోసం 50 రోజులు స్నానం చేయలేదట!

సినిమా పాత్రకు న్యాయం చేయడానికి నటీనటులు ఎంతటి రిస్క్ అయినా చేస్తారు. కొందరు బరువు తగ్గడం, పెరగడం వంటివి చేస్తుంటారు. అయితే, ఓ హీరో మాత్రం తన సినిమా కోసం ఏకంగా 50 రోజులు స్నానం చేయకుండా వింతగా ప్రవర్తించారట. ఇంతకీ ఆ నటుడు ఎవరు, ఆ సినిమా ఏంటో తెలుసుకుందాం.

ముకేష్ తివారీ.. ‘చైనా గేట్’ సినిమా కోసం వింత ప్రవర్తన

రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వం వహించిన ‘చైనా గేట్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించకపోయినా, అందులోని విలన్ పాత్ర జాగీరా మాత్రం ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. ఈ పాత్రను పోషించిన నటుడు ముకేష్ తివారీ. ఈ పాత్ర గతంలో సూపర్ హిట్ అయిన ‘షోలే’ చిత్రంలోని గబ్బర్ సింగ్ పాత్రను గుర్తు చేసింది. సినిమా విడుదలై 27 సంవత్సరాలు అయినప్పటికీ, జాగీరా చెప్పే డైలాగ్స్ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తున్నాయి.

పాత్ర కోసం త్యాగాలు..

‘చైనా గేట్’ సినిమాలో ముఖేష్ తివారీ పర్వత ప్రాంతంలో నివసించే క్రూరమైన బందిపోటు జాగీరా పాత్రను పోషించారు. ఈ పాత్రకు 100% న్యాయం చేయడానికి, ముఖేష్ ఏకంగా 50 రోజులు స్నానం చేయడం మానేశాడట. పాత్ర కోసం పూర్తిగా మురికిగా కనిపించారు. స్నానం చేయకపోయినా, దుర్వాసన రాకుండా ఉండటానికి పెర్ఫ్యూమ్ వాడేవారట. షూటింగ్ సమయంలో ఆయన చుట్టూ రాబందులు, కాకులు ఎక్కువగా తిరిగేవని ప్రచారంలో ఉంది. జుట్టును కూడా కత్తిరించుకోలేదు. దీంతో ఆయన్ని చూడగానే ప్రజలు భయంతో పారిపోయేవారట. ఈ చిత్రంలో ముఖేష్ తివారీతో పాటు ఓం పురి, నసీరుద్దీన్ షా, అమ్రిష్ పురి వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు.

కెరీర్ మలుపు..

ఈ సినిమాతో ముఖేష్ తివారీకి రాత్రికి రాత్రే స్టార్‌డమ్ వచ్చింది. అయితే, ఈ చిత్రం తర్వాత రెండేళ్లపాటు ఆయనకు మరో ఆఫర్ రాలేదు. ఆ తర్వాత రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ‘గోల్ మాల్’ సినిమాలో వాసులి భాయ్ పాత్రతో ఆయన మరింత ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించి బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment