అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నేడు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ దేశాల ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. అయితే, ఈ ఈవెంట్‌కు ముందు ట్రంప్ నిర్వహించిన ‘క్యాండిల్ లైట్ డిన్నర్’లో భారత కుబేరుడు ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ పాల్గొన్నారు. ఈ ప్రత్యేక సందర్బంగా ట్రంప్‌తో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాణస్వీకారోత్సవం తర్వాత, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సోషల్ మీడియా దిగ్గజం మార్క్ జుకర్‌బర్గ్ అందించే ప్రత్యేక డిన్నర్లో కూడా ముకేశ్-నీతా అంబానీ పాల్గొనబోతున్నారు.
ట్రంప్ ‘క్యాండిల్ లైట్ డిన్నర్’లో ముకేశ్-నీతా అంబానీ
