ఆధ్యాత్మిక మహోత్సవం మహా కుంభమేళా ముకేశ్ అంబానీ కుటుంబం సందడి చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో ముకేశ్ అంబానీ కుటుంబం పుణ్యస్నానం ఆచరించింది. ముకేశ్ అంబానీ తన తల్లి, కుమారులతో కలిసి పవిత్ర స్నానం చేశారు.
ప్రయాగ్‌రాజ్‌కు ప్రత్యేక హెలికాప్టర్‌లో చేరుకున్న ముకేశ్ కుటుంబం పడవలో ప్రయాణించి త్రివేణి సంగమానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం పుణ్యస్నానం ఆచరించారు. ముకేశ్ అంబానీ తన తల్లి కోకిలాబెన్, కుమారులు ఆకాశ్, ఆనంత్, కోడళ్ళు శ్లోకా, రాధికా, మనుమలు పృథ్వి, వేద, అక్కలు దీప్తి సల్గావ్కర్, నీనా కోఠారి తదితరులున్నారు. ముకేశ్ అంబానీ అత్త పూర్ణిమాబెన్ దలాల్, మరదలు మమతాబెన్ దలాల్ కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భూటాన్ రాజు, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు సైతం పుణ్య స్నానాలు ఆచరించారు. త్రివేణి సంగమంలో ఇప్పటి వరకు 44 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు.