‘ముఫాసా’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. వసూళ్లతో ముందుకొస్తున్న ‘సింహం’

‘ముఫాసా’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. వసూళ్లతో ముందుకొస్తున్న 'సింహం'

హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్ యానిమేషన్ చిత్రం ‘ముఫాసా.. ది లయన్ కింగ్’ డిసెంబర్ 20న విడుదలై ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఈ సినిమా కలెక్షన్స్ వివరాలను చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మన్ననలను అందుకుంటున్న ఈ సినిమా, దేశీయ మార్కెట్లో మొదటి వారంలో రూ. 74 కోట్లు వసూలు చేసింది.

దేశ వ్యాప్తంగా ఇంగ్లిష్ వెర్షన్‌లో రూ. 26.75 కోట్లు, హిందీ, తెలుగు వెర్షన్లు కలిపి రూ. 11.3 కోట్లు వ‌సూలు చేసింది. ఈ వసూళ్లతో, ముఫాసా అభిమానులను మరింత ఆకర్షించడంలో విజయం సాధించింది. ముఫాసా కథను ప్రపంచ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన యానిమేషన్ మాజిక్, విజయానికి కీలకంగా నిలిచింది.

ముఫాసాగా సూప‌ర్ స్టార్‌..
సూపర్‌స్టార్ మహేష్ బాబు తన ఫ్యాన్స్‌ను అలరించడానికి ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యమయ్యారు. డిస్నీ యానిమేషన్ చిత్రం “ముఫాసా” కోసం మహేష్ తన వాయిస్ మేజిక్‌తో రంగంలోకి దిగాడు.”ది లయన్ కింగ్” ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా తెలుగులో ప్రధాన సింహం పాత్రకు మహేష్ బాబు వాయిస్ డబ్బింగ్ చెప్ప‌డం ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది.

Join WhatsApp

Join Now

Leave a Comment