మృణాల్–ధనుష్ డేటింగ్ రూమర్లు.. క్లారీటీ ఇచ్చిన మృణాల్

మృణాల్–ధనుష్ డేటింగ్ రూమర్లు.. క్లారీటీ ఇచ్చిన మృణాల్

హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మరియు ధనుష్ మధ్య డేటింగ్ రూమర్లు మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి. “మా మధ్య డేటింగ్ ఏమీ లేదు… ధనుష్ నాకు కేవలం ఫ్రెండ్ మాత్రమే” అంటూ మృణాల్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చినా, ఇద్దరూ కలిసి ఈవెంట్స్‌లో కనిపించడం, ప్రీమియర్స్‌లో క్లోజ్‌గా మెలగడం వంటి కారణాలతో నెటిజన్స్ సందేహాలు తగ్గడం లేదు. ముఖ్యంగా వారి సినిమాల రిలీజ్ టైంలో ఈ రూమర్లు మరింతగా హైలైట్ అవుతూ, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

ఇటీవల ప్రమోషన్స్‌లో భాగంగా మృణాల్ తమిళంలో సులభంగా మాట్లాడటం మరోసారి చర్చకు దారి తీసింది. ఇప్పటివరకు తమిళంలో సినిమా చేయని ఆమె అకస్మాత్తుగా భాషలో కమ్ఫర్ట్‌గా మాట్లాడటంతో, ఈ స్కిల్ ధనుష్ వల్లే వచ్చిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చెన్నై విజిట్స్, ఈవెంట్ అపియరెన్స్ ఇలా అన్నీ కలిపి వీరి మధ్య ఏదో ఉందనే గాసిప్స్ మళ్లీ ఊపందుకున్నాయి. అయితే ఈ వార్తలపై మృణాల్ ఎలా స్పందిస్తారో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment