Mr. ICC కోహ్లినే.. నెట్టింట హాట్ టాపిక్

Mr. ICC కోహ్లినే.. నెట్టింట హాట్ టాపిక్

భారత క్రికెట్ సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి గురించి జ‌రుగుతున్న చ‌ర్చ‌ నెట్టింట మరోసారి హీట్ పెంచుకోంది. ఎందుకంటే “Mr. ICC” అనే టైటిల్‌కు అసలైన అర్హుడు ఎవరు?” అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. విరాట్ కోహ్లి తన క్రికెట్ కెరీర్‌లో ఇప్పటివరకు 5 ICC ట్రోఫీలు గెలుచుకున్నాడు. అంతేకాకుండా, మూడు సార్లు “ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్” అవార్డును కూడా దక్కించుకున్నాడు. ICC ఈవెంట్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు కోహ్లియే.

ICC సెమీఫైనల్స్ & ఫైనల్స్‌లో అత్యధిక “ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్” అవార్డులు, రెండు సార్లు ICC డికేడ్ అవార్డ్స్, ఎనిమిది సార్లు ICC యాన్వల్ అవార్డ్స్ ఇన్ని ఘనతలు ఉన్న కోహ్లికే “Mr. ICC” అని పిలవకపోతే మరెవరికి? అని ఆయన అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కోహ్లి ఫ్యాన్స్ ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. కోహ్లీ ఫ్యాన్స్ జోరు క్రీడాకారుల మ‌ధ్య అభిమానుల మ‌ధ్య వివాదం సృష్టిస్తుందేమో అన్నంత ఉధృతంగా సాగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment