మోగ్లీ 2025.. స్పెషల్ టీజర్‌తో మేకర్స్ సర్‌ప్రైజ్!

మోగ్లీ 2025.. స్పెషల్ టీజర్‌తో మేకర్స్ సర్‌ప్రైజ్!

రోషన్ కనకాల లీడ్ రోల్‌లో నటిస్తున్న ‘మోగ్లీ 2025’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సాక్షి మధోల్కర్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా మేకర్స్ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్‌ను అందించారు. ‘మోగ్లీ 2025’ షూటింగ్ ఇటీవ‌ల‌ అధికారికంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా వాలెంటైన్ డే స్పెషల్ టీజర్‌ను మేయ‌ర్స్‌ విడుదల చేశారు.

ఈ చిత్రానికి కీర‌వాణి కుమారుడు కాల భైరవ సంగీతం అందిస్తున్నారు, టీజీ విశ్వ ప్రసాద్ త‌న సొంత బ్యాన‌ర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా, ఇవాళ విడుద‌లైన మోగ్లీ 2025 టీజర్ సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది. త‌న కుమారుడు న‌టిస్తున్న సినిమా టీజ‌ర్‌ను యాంక‌ర్ సుమ క‌న‌కాల ఎక్స్ (ట్విట్ట‌ర్) వేదిగా షేర్ చేశారు. ఒక నిశ్శబ్ద ప్రేమకథలో భీక‌ర‌ యుద్ధాన్ని ప్ర‌జ్వ‌లిస్తున్నాం అనే కాప్ష‌న్‌ను జ‌త చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment