విశాఖపట్నం (Visakhapatnam) మధురవాడ (Madhurawada) లో విషాద ఘటన చోటుచేసుకుంది. న్యూ పోర్ట్ (New Port) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన మరువకముందే మధురవాడలో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మధురవాడ కొమ్మాది స్వయం కృషినగర్‌లో ప్రేమోన్మాది (Obsessed Lover) నవీన్ (Naveen) తల్లీకూతుళ్ల (Mother and Daughter)పై దాడి చేశాడు. కత్తి (Knife) తో విచక్షణారహితంగా దాడి (Attack) చేయడంతో తల్లి నక్కా లక్ష్మి (43) అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్ర గాయాలపాలైన యువతి దీపిక (20) ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.
నక్కా దీపిక డిగ్రీ చదువుతోంది. గత కొన్నాళ్లుగా ప్రేమోన్మాది నవీన్ మృతిచెందిన దీపికను ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడు. అతని ప్రేమను యువతి నిరాకరించడంతో ఆగ్రహం చెందిన నవీన్ దీపికను హత్య చేయాలనుకున్నాడు. కత్తితో దీపికపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అడ్డొచ్చిన తల్లిపై కూడా దాడి చేశాడు. నక్కా లక్ష్మి ఘటనా స్థలంలోనే మృతిచెందగా, దీపిక ఆస్పత్రితో చికిత్స పొందుతుంది. సంఘటనా స్థలానికి పీఎం పాలెం పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. వీరి స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా పుర్లి గ్రామం.