భారతదేశాన్ని(India) వణికించిన మోస్ట్ వాంటెడ్ (Most Wanted) టెర్రరిస్ట్ (Terrorist) అగ్రదేశం అమెరికాలో(USA) అరెస్టయ్యాడు. పంజాబ్ రాష్ట్రం (Punjab State) లో గత ఆరు నెలల్లో 14 ఉగ్రవాద దాడులకు కారణమైన హరీప్రీత్ సింగ్ (Harpreet Singh) అలియాస్ (Alias) హ్యాపీ పాసియాను (Happy Passia) అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
హరీప్రీత్ సింగ్ అమెరికాలో నివాసం ఉంటూ భారతదేశంలో శాంతి భద్రతలకు ముప్పు కలిగిస్తున్నాడు. యూఎస్‌లో తలదాచుకుంటూ భారత్‌లో ఉగ్రదాడులకు పాల్పడుతున్నారు. హరీప్రీత్ సింగ్ మీద భారత ప్రభుత్వం రూ.5 లక్షల రివార్డ్ (Reward) ప్రకటించింది. భారత్‌లో అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదిగా ఇతన్ని పరిగణిస్తోంది. ప్రస్తుతం అతడు ICE కస్టడీలో ఉన్నట్టు సమాచారం. అతడిని భారత్‌కు అప్పగించే ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కావొచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
“బ్రాహ్మణులపై మూత్రం పోస్తా” – అనురాగ్ కశ్యప్ వివాదాస్పద వ్యాఖ్య