ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరో ఎవరు..? అనే ప్రశ్న అభిమానుల మదిలో ఎప్పుడూ మెదులుతూ ఉంటుంది. కాగా, ORMAX మీడియా తాజా నివేదిక విడుదల చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మరోసారి ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరోగా నిలిచారు. నవంబర్ నెల ర్యాంకింగ్స్‌లో ప్రభాస్ అగ్రస్థానాన్ని కొనసాగించారు. ఆయన తర్వాతి స్థానాల్లో దళపతి విజయ్, అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్, జూనియర్ ఎన్టీఆర్ నిలిచారు.
Ormax Stars India Loves: Most popular male film stars in India (Nov 2024) #OrmaxSIL pic.twitter.com/n03VKxAyuQ
— Ormax Media (@OrmaxMedia) December 21, 2024
Female Actress విభాగంలో ఎవరు?
మహిళా నటులలో, నవంబర్ నెలకు గాను సమంత మోస్ట్ పాపులర్ హీరోయిన్‌గా నిలిచారు. ఆమెకు తరువాతి స్థానాల్లో ఆలియా భట్, నయనతార, సాయి పల్లవి, దీపికా పదుకొణె, త్రిష ఉన్నారు. ఈ ర్యాంకింగ్స్ ప్రముఖుల పాపులారిటీని తెలియజేయడంలో గణనీయమైన పాత్ర పోషిస్తున్నాయి. ORMAX మీడియా ఇలా ప్రతి నెలా మోస్ట్ పాపులర్ హీరోలు, హీరోయిన్ల జాబితాలను తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్టు చేస్తుంటుంది.