Mona Lisa Request.. నా అకౌంట్ తిరిగి ఇచ్చేయండి ప్లీజ్‌

Mona Lisa Request.. నా అకౌంట్ తిరిగి ఇచ్చేయండి ప్లీజ్‌

ఉత్తర ప్రదేశంలోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj) మహాకుంభమేళాలో ఫేమ‌స్ అయిన మోనాలిసా (Monalisa) తన అభిమానులతో భావోద్వేగంగా స్పందిస్తూ వీడియోను పంచుకున్నారు. కుంభమేళా (Kumbh Mela)లో పూసల దండ‌లు అమ్ముతూ కనిపించిన మోనాలిసా ఓవ‌ర్‌నైట్ స్టార్ (Celebrity) అయ్యారు. ఆమెను చూసిన‌ ప్రతి ఒక్కరు చూపు తిప్పుకోకుండా ఉండిపోయారు. పూసలమ్మే యువ‌తికి హీరోయిన్ లాంటి అందం ఎలా సాధ్యమైందని అంతా షాక్ అయ్యారు. దీంతో మోనాలిసాకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. మోనాలిసా ఎక్కడ కనిపించినా ఆమెతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు కుంభ‌మేళాకు వ‌చ్చిన యువత, యూట్యూబర్స్ వెంటపడి ఆమెను ఇబ్బందులకు గురిచేసేవారు. ఓ బాలీవుడ్ డైరెక్ట‌ర్ సైతం ఆమెకు సినిమా ఛాన్స్ ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చారు.

మోనాలిసా ఇల్లు..
తాజాగా మోనాలిసా ఒక వీడియోలో తన కుటుంబంతో నివసించే ఇంటిని చూపించారు. ఇది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సమీపంలోని నా ఇల్లు. ఇక్కడ నేను నా కుటుంబంతో కలిసి చిన్న ఊర్లో నివసిస్తున్నాను. కానీ, నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ (Instagram Hacked) అయింది. దయచేసి దానిని తిరిగి నాకు ఇవ్వండి అని ఆమె విజ్ఞ‌ప్తి చేశారు. ఈ వీడియోను ఆమె ఎక్స్ (ట్విట్టర్) ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేశారు. ఈ విజ్ఞప్తి ఆమె అభిమానుల్ని ఆకట్టుకుంది, మోనాలిసాకు మద్దతుగా వారు స్పందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment