చిక్కుల్లో మోహన్ బాబు యూనివర్సిటీ.. గుర్తింపు ర‌ద్దు చేస్తారా..?

చిక్కుల్లో మోహన్ బాబు యూనివర్సిటీ

సినీ న‌టుడు, ప‌ద్మ‌శ్రీ మంచు మోహ‌న్‌బాబుకు చెందిన మోహ‌న్‌బాబు యూనివ‌ర్సిటీ చిక్కుల్లో ప‌డింది. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీపై భారీ అక్రమాల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. పేరెంట్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదుతో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించే విద్యార్థుల నుండి గత మూడు సంవత్సరాలుగా అదనంగా రూ.26 కోట్లు వసూలు చేసినట్లు విచారణలో తేలింది.

విద్యార్థుల ఫిర్యాదులను పరిశీలించిన ఉన్నత విద్యా రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ (AP-HERMC) యూనివర్సిటీపై సవివర విచారణ జరిపి, ఈ అక్రమ వసూళ్లను నిర్ధారించింది. నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేసినందుకు జరిమానా విధిస్తూనే.. విద్యార్థుల నుంచి వసూలు చేసిన రూ.26 కోట్లను 15 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది.

ఇకపై ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా ఉండేందుకు మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వానికి కమిషన్ సిఫారసు చేసింది. ఈ కేసుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నత విద్యాశాఖ పరిశీలనలో ఉందని సమాచారం. విద్యార్థులపై భారంగా మారిన ఫీజు విధానంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment