అసలైన ‘OG’లు ఎవరు? విష్ణు ఆసక్తికర ట్వీట్

అసలైన ‘OG’లు ఎవరు? విష్ణు ఆసక్తికర ట్వీట్

టాలీవుడ్ ప్ర‌ముఖ నటుడు మంచు విష్ణు లేటెస్ట్‌ ట్వీట్ అభిమానుల్లో ఆస‌క్తిరేపుతోంది. తన తండ్రి మోహన్ బాబు మరియు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ)ల గురించి ఇంట్రెస్టింగ్‌ ట్వీట్ చేశారు. ఈ ఇద్దరు సినీ దిగ్గజాలు కలిసి ఉన్న ఫోటోను ఎక్స్‌లో షేర్ చేస్తూ, “ఇదొక చక్కని సాయంత్రం. ఇద్దరు ‘OG’లు మోహన్ బాబు, వర్మ కలిశారు. వీరిద్దరిలో ఎవరు పెద్ద రౌడీ?” అంటూ వ్యాఖ్యానించారు.

విష్ణు చేసిన ఈ ట్వీట్ అభిమానులను ఆకట్టుకుంది. మోహన్ బాబు, ఆర్జీవీ ఇద్దరూ బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా తమదైన ముద్ర వేసుకున్నవారే. అందుకే, ‘OG’ అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ ఎవరు? అనే ప్రశ్న నెటిజన్లలో ఆసక్తి రేపుతోంది. మంచు విష్ణు తరచుగా తన కుటుంబ విశేషాల‌ను సోషల్ మీడియాలో పంచుకుంటారు. తన ట్వీట్ ద్వారా మోహ‌న్‌బాబు, వ‌ర్మ‌ మధ్య అనుబంధాన్ని మళ్లీ గుర్తు చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment