---Advertisement---

మోహన్‌బాబుపై నిఘా..! చర్యలకు పోలీసులు సిద్ధ‌మ‌వుతున్నారా?

మోహన్‌బాబుపై నిఘా..! చర్యలకు పోలీసులు సిద్ధ‌మ‌వుతున్నారా?
---Advertisement---

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ప్రముఖుడు మోహన్‌బాబుపై చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారా అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. మంచు ఫ్యామిలీ త‌గాదాల‌ను క‌వ‌ర్ చేసేందుకు జ‌ల్‌ప‌ల్లిలోని త‌న నివాసంలోకి వ‌చ్చిన‌ జ‌ర్న‌లిస్ట్‌పై మోహ‌న్‌బాబు దాడి చేసిన కేసులో గతంలో హైకోర్టు ఇచ్చిన ఉపశమనం ఈరోజుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మోహన్‌బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను నిన్న ధర్మాసనం కొట్టేసింది.

నోటీసులు జారీ, విచారణకు పిలుపు
పోలీసులు మోహన్‌బాబుకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలవాలని నిర్ణయించారు. ఈ కేసులో తదుపరి దశలో తీసుకోవాల్సిన చర్యలు అధికారుల నుంచి త్వరలోనే వెల్లడయ్యే అవకాశముంది. మ‌రి దీనిపై మోహ‌న్‌బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

కాగా, మంచు ఫ్యామిలీ త‌గాదాల అంశం మ‌రో కీల‌క మ‌లుపు తీసుకుంది. అన్న మంచు విష్ణుపై త‌మ్ముడు మ‌నోజ్ ప‌హ‌డీష‌రీఫ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. త‌న అన్న నుంచి త‌న‌కు హాని ఉంద‌ని మొత్తం ఏడు అంశాలపై విష్ణుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంచు మనోజ్ ఫిర్యాదు చేయడంతో పరస్పర ఆరోపణలు పెరిగాయి. విష్ణుతో పాటు వినయ్‌పై కూడా ఫిర్యాదు నమోదైంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment