మంచు ఫ్యామిలీ వివాదం ఒక కొలిక్కి వస్తుందనుకుంటున్న తరుణంలో మోహన్‌బాబు(Mohan Babu) గురించి మరో సంచలన వార్త బయటకు వచ్చింది. అలనాటి అందాల తార సౌందర్య(Soundarya) మరణం వెనుక మోహన్‌బాబు హస్తం ఉందని ఓ వ్యక్తి పోలీసులకు చేసిన ఫిర్యాదు సంచలనంగా మారింది.
సౌందర్య హెలికాప్టర్ ప్రమాదం(Helicopter Crash)లో మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఆమె మృతి వెనుక ఒక రహస్యం ఉందని, ఉందంటూ ఆమె చనిపోయిన 20 ఏళ్ల తరువాత ఖమ్మం జిల్లాకు చెందిన చిట్టిమల్లు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడం టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. “శంషాబాద్‌లోని జల్‌పల్లిలో ఉన్న ఆరు ఎకరాల భూమిలో సౌందర్యకు గెస్ట్ హౌస్ ఉండేది, దాన్ని విక్రయించాలని మోహన్‌బాబు ఆమెపై ఒత్తిడి తీసుకురాగా, గెస్ట్ హౌస్ విక్రయించేందుకు సౌందర్య, ఆమె సోదరుడు నిరాకరించారు. ఇదే వివాదం చివరికి హత్యకు దారి తీసింది” అని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అంతేకాదు “సాక్ష్యాలు దొరక్కుండా హెలీకాప్టర్ ప్రమాదంలో హత్య చేయించాడు. సౌందర్య హెలికాప్టర్ ప్రమాదం తర్వాత మోహన్ బాబు ఈ భూమిని స్వాధీనం చేసుకున్నారు” అంటూ ఆ వ్యక్తి ఆరోపించారు. ఈ ఆరోపణలపై మోహన్ బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.