మోహన్ బాబుకు కోర్టు షాక్‌.. మనోజ్ సాక్ష్యాలతో కేసు కొత్త మలుపు

మోహన్ బాబుకు కోర్టు షాక్‌.. మనోజ్ సాక్ష్యాలతో కేసు కొత్త మలుపు

సినీ నటుడు మంచు మోహన్ బాబు ( Manchu Mohan Babu) కు ఎల్బీనగర్ కోర్టు (LB Nagar Court) లో భారీ షాక్ (Shock) తగిలింది. గతంలో ఆయనకు అనుకూలంగా వచ్చిన తీర్పును కోర్టు రద్దు చేసింది. ఈ తీర్పు మోహ‌న్‌బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ (Manchu Manoj) న్యాయవాది సమర్పించిన ఆధారాలు వెనుక కీలకంగా నిలిచినట్లుగా స‌మాచారం.

జ‌ల్‌ప‌ల్లి (Jalpally) లోని నివాసంలో త‌లెత్తిన వివాదంపై గ‌తంలో మంచు మోహ‌న్‌బాబు కోర్టును ఆశ్ర‌యించారు. ఇంట్లో ఇబ్బందుల‌కు గురిచేస్తున్నాడ‌ని, మ‌నోజ్ త‌న నివాసంలోకి రాకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టుకు త‌న న్యాయ‌వాది ద్వారా విన్న‌వించారు. అయితే ఇదే కేసులో కోర్టును మోహన్ బాబు తప్పుదోవ ప‌ట్టించార‌ని పలు సాక్ష్యాలతో (Several Evidences) మనోజ్ తరపు న్యాయవాది (Lawyer) ప్రస్తావించారు. దీనితో కోర్టు సీరియస్‌గా స్పందించి, తప్పిదానికి పాల్ప‌డిన‌ క్లర్కుకు కోర్టు మెమో జారీ చేసింది. ఈ పరిణామాలతో మంచు ఫ్యామిలీలో కొనసాగుతున్న ఆస్తి వివాదం మరింత తీవ్రరూపం దాల్చింది. ఇది మంచు కుటుంబంలోని ఆస్తులపై సాగుతున్న చిచ్చులో మరో కీల‌క‌ మలుపుగా (Turning Point) చెబుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment