తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటుడు మంచు మోహన్ బాబు మరో వివాదంలో చిక్కుకున్నారు. మోహన్‌బాబు బౌన్సర్లు మరోసారి రెచ్చిపోయారు. ఈసారి తిరుపతిలోని ఆయన విద్యా సంస్థ సమీపంలోని ఓ రెస్టారెంట్‌ను దారుణంగా ధ్వంసం చేశారు. బౌన్సర్లు రెస్టారెంట్ యాజమాన్యంతో గొడవ పడుతూ అద్దాలు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా రెస్టారెంట్ వద్ద ఉన్న వారిపై కూడా దాడికి యత్నించారు. ఈ ఘటనపై రెస్టారెంట్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసినా, వారు చర్యలు తీసుకోలేదని చెప్పారు.
ఈ ఘటనపై మోహన్‌బాబు తనయుడు మంచు మనోజ్ స్పందించారు. రెస్టారెంట్ వద్దకు వెళ్లి అక్కడి పరిస్థితిని సమీక్షించనున్నారు. అలాగే, హోటల్ యాజమాన్యానికి ఆర్థిక సహాయం అందించి, ధైర్యం చెప్పాలని ఆయన నిర్ణయించారు. ఇంతవరకు ఈ ఘటనపై పోలీసుల నుంచి ఎటువంటి చర్యలు తీసుకోలేదు.