---Advertisement---

మోహన్ బాబు బ‌ర్త్ డే.. మనోజ్ ఎమోష‌న‌ల్‌ ట్వీట్

మోహన్ బాబు బ‌ర్త్ డే.. మనోజ్ ఎమోష‌న‌ల్‌ ట్వీట్
---Advertisement---

టాలీవుడ్ ప్ర‌ముఖ నటుడు మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమారుడు మంచు మనోజ్ హృదయాన్ని హత్తుకునే విధంగా ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. తండ్రితో దిగిన అనేక ఫొటోలు, సినిమాల్లోని ముఖ్యమైన సన్నివేశాలతో పాటుగా “నా సూర్యుడివి, నా చంద్రుడివి” అనే పాటను జతచేసి ఒక ప్రత్యేకమైన వీడియోని షేర్ చేశారు.

“నీ పుట్టినరోజున నీ పక్కన లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది. నిన్ను కలిసే రోజు కోసం ఎదురు చూస్తున్నా నాన్న. నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నా” అంటూ మనోజ్ తన భావోద్వేగాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నారు.

ఇటీవల మంచు కుటుంబంలో విభేదాలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ట్వీట్ వారి మధ్య సంబంధాలపై కొత్త చర్చకు తెరతీసింది. మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలు కుటుంబ సభ్యులను ఏకతాటిపైకి తీసుకురావో చూడాలి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment