తెలుగు చిత్రసీమలో సుప్రసిద్ధ నటుడిగా పేరుతెచ్చుకున్న మోహన్ బాబు ఇంట వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన అక్కడ చోటుచేసుకున్న పరిణామాలను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్‌బాబు దాడి చేశారు. అనంతరం ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మోహన్‌బాబు.. మీడియా ప్రతినిధుల దాడి స్పందించారు. మీడియా పై జరిగిన వివాదానికి సంబంధించి తన తప్పులను అంగీకరించారు. తన మూలంగా ఒక జర్నలిస్టు గాయపడటం చాలా బాధాకరమని పేర్కొంటూ, ఆయన కుటుంబానికి మరియు టీవీ9 ఛానల్‌కి లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పారు.
మోహన్ బాబు తన లేఖలో పేర్కొన్నట్లు, “నా కుటుంబ సంబంధిత ఘటన ఇంత పెద్ద సమస్యగా మారి, టీవీ9ను మరియు జర్నలిస్టులను బాధపెట్టడం నన్ను తీవ్రంగా కలచివేసింది. జరిగిన ఘటన తర్వాత ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో ఉండటం వల్ల వెంటనే స్పందించలేకపోయాను. ఆ రోజు జరిగిన ఆవేశం నా తప్పిదం, దాని వల్ల జర్నలిస్టుకు గాయమయ్యే పరిణామం బాధాకరం” అని వివరించారు. అనంతరం, మోహన్ బాబు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతూ, ఇలాంటి ఘటనలు ఇకపై పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.







