ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్ర మోడీ (Narendra Modi), అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ల మధ్య త్వరలో భేటీ (Meeting) జరిగే అవకాశం ఉన్నట్లు అమెరికా వర్గాలు సంకేతాలు ఇచ్చాయి. ఈ భేటీ రెండు దేశాల మధ్య సుంకాల వివాదం (Tariffs Dispute) కారణంగా దెబ్బతిన్న సంబంధాలను మరోసారి బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.
సుంకాల విషయంలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, మోడీ-ట్రంప్‌ల మధ్య బలమైన సంబంధాలు కొనసాగుతున్నాయని అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌లో ఇద్దరు నాయకులు కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సమ్మిట్‌లో అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరిగితే, ఈ ఏడాదిలోనే వారి భేటీ ఉండవచ్చు.
సుంకాల వివాదం: ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై అకస్మాత్తుగా సుంకాలు విధించింది. తొలుత 25% సుంకం విధించగా, రష్యాతో సంబంధాల కారణంగా మరో 25% సుంకం విధించారు. దీంతో భారత్‌పై మొత్తం 50% సుంకం భారం పడింది. దీనిపై ప్రధాని మోడీ “రైతుల కోసం ఎంత భారమైనా భరిస్తాం” అని ప్రకటించారు. ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీశాయి. ఈ భేటీ జరిగితే ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.







