మోదీపై సైఫ్ అలీ ఖాన్ ప్రశంసలు

మోదీపై సైఫ్ అలీ ఖాన్ ప్రశంసలు

రాజ్ కపూర్ శత జయంతి సందర్భంగా కపూర్ ఫ్యామిలీ ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సమావేశం అనంతరం సైఫ్ అలీ ఖాన్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

సైఫ్ అలీ ఖాన్ వ్యాఖ్యలు..
“మోదీ పార్లమెంట్ సమావేశాల తర్వాత మా కుటుంబాన్ని కలవడానికి వచ్చారు. అలసిపోయి ఉండవచ్చు అని నేను ఊహించాను, కానీ ఆయన మా అందరినీ చూసి నవ్వుతూ చాలా బాగా మాట్లాడారు. ఆయనకు కరీనా, కరిష్మా, రణబీర్‌ వంటి వారిని వ్యక్తిగతంగా పలకరించడం చాలా గౌరవంగా అనిపించింది” అన్నారు సైఫ్.

ప్రధానితో జరిగిన సంభాషణలో, సైఫ్ తల్లిదండ్రుల గురించి, తమ పిల్లలైన తైమూర్‌, జహంగీర్ గురించి కూడా ప్రస్తావించారట. మోడీ తమ కుటుంబాన్ని గౌరవించి, ప్రత్యేక ఆటోగ్రాఫ్ ఇచ్చారని కూడా తెలిపారు.

మోదీ పనితీరు..
సైఫ్ ఇంకా ఏమ‌న్నారంటే.. మోదీ రోజూ ప్రజలను కలిసేందుకు సమయాన్ని వెతుక్కుంటున్నారు. ఆయన నిత్యం కష్టపడుతున్నారని, రాత్రిపూట మూడు గంటలు మాత్రమే నిద్రపోతారని తెలిసి ఆశ్చర్యపోయాను అని అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment