మోడల్ డేల్ హడన్ దుర్మ‌ర‌ణం

మోడల్ డేల్ హడన్ దుర్మ‌ర‌ణం

అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రముఖ మోడల్ డేల్ హడన్ (76) తన నివాసంలో దుర్మ‌ర‌ణం చెందారు. ఆమె ఇంటి మొదటి అంతస్తులో నిర్జీవంగా కనిపించడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హడన్‌ను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రాథమిక విచారణలో ఆమె విషపూరిత కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ పీల్చడం వల్ల అపస్మారక స్థితికి చేరుకున్నట్లు గుర్తించారు. ఆమె ఇంటిలోని బాయిలర్‌ హీటింగ్‌ యూనిట్‌లో లోపాలు ఉన్నట్లు గుర్తించారు.

ఈ లోపం కారణంగానే ఈ కెనడా మోడల్ డేల్ హ‌డ‌ల్ మరణించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అగ్నిమాపక కంపెనీ నమోదు చేసిన రీడింగ్‌లో ఆ ఇంటిలో కార్బన్‌ మోనాక్స్‌డ్ విప‌రీతంగా ఉన్నట్లు తేల్చారు. విషపూరిత గ్యాస్ ప్రమాదాలు, ముఖ్యంగా కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం, ప్రాణాలకు తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తుంది. హడన్ మరణం ఇలా జరిగిన మొదటి సందర్భం కాదని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment