---Advertisement---

రీల్స్ కోస‌మే.. MMTSలో అత్యాచారయత్నం కేసులో బిగ్ ట్విస్ట్

రీల్స్ కోస‌మే.. MMTSలో అత్యాచారయత్నం కేసులో బిగ్ ట్విస్ట్
---Advertisement---

హైదరాబాద్‌ (Hyderabad) MMTS రైలు (Train) లో అత్యాచారం ఘటన కీల‌క‌ మలుపు తిరిగింది. కొద్ది రోజుల క్రితం ఒక యువతి అత్యాచారయత్నం (Attempted Rape) నుంచి తప్పించుకునేందుకు రైలు నుంచి దూకిందని (Jumped) వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ, విచార‌ణ‌లో విస్తుపోయే నిజాలు వెల్ల‌డ‌య్యాయి. దీంతో యువ‌తి చెప్పిన స‌మాధానాలు విని పోలీసులు కూడా షాక్ అయ్యారు.

పోలీసులు (Police) చేపట్టిన లోతైన విచారణలో నిజాలు (Facts) బయటపడ్డాయి. అసలు యువతిపై ఎటువంటి అత్యాచారయత్నం జరగలేదని వెల్లడైంది. రైల్లో ప్రయాణిస్తూ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ (Instagram Reels) చేస్తున్న సమయంలో, ఆమె అనుకోకుండా కింద పడిపోయిందట. అయితే ఈ విషయం చెబితే సమాజం తిడుతుందని భయపడి, ఒక యువకుడు అత్యాచారం చేయబోయాడు కాబట్టి దూకానని తప్పుడు వాంగ్మూలం (False Statement) ఇచ్చింది.

తాజాగా, యువతి తాను చెప్పినవి అబద్ధమని (False) ఒప్పుకోవడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. ఈ మేరకు కేసులో తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. యువతి సోషల్ మీడియాలో పాపుల‌ర్ అవ్వాల‌ని లైఫ్ రిస్క్ చేయ‌డం, ఆ ఘటనల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయ‌డంపై పోలీసులకు సైతం ఆగ్ర‌హం తెప్పిస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment