“చెప్పు తెగేదాక కొడతా!” – ఎమ్మెల్యే కొలికపూడి వివాదాస్పద వ్యాఖ్య

“చెప్పు తెగేదాక కొడతా!” – ఎమ్మెల్యే కొలికపూడి వివాదాస్పద వ్యాఖ్య

కృష్ణా జిల్లా (Krishna District) తిరువూరు ఎమ్మెల్యే (Tiruvuru MLA) కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivasa Rao) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తిరువూరు నియోజకవర్గంలోని కొండూరు (Konduru) ప్రాంతంలో 20 రోజులుగా తాగునీటి సరఫరా సరిగా జరగడం లేదని ప్రజలు సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేస్తుండగా, ఎమ్మెల్యే ఈ ఆరోపణలను తిప్పికొట్టారు. కావాలనే కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించిన ఆయన, “గాలి వార్తలు సృష్టించే వాళ్లను చెప్పు తెగేదాక కొడతా” అంటూ అధికారిక సమావేశంలోనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుండగా, ఎమ్మెల్యే మాట్లాడాల్సిన మాటలు ఇవేనా అని తీవ్రంగా స్పందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment