ఆస్ట్రేలియా స్టార్ (Australia Star) పేసర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక అపురూపమైన ఘనతను సాధించాడు. వెస్టిండీస్ (West Indies)తో కింగ్‌స్టన్‌లో జరిగిన మూడో టెస్ట్ (Third Test) (డే-నైట్ టెస్ట్)లో స్టార్క్ కేవలం 15 బంతుల్లోనే ఐదు వికెట్లు(Five Wickets) తీసి సరికొత్త రికార్డు నమోదు చేశాడు. టెస్ట్ చరిత్రలో బంతుల పరంగా ఇది ఇప్పటివరకు వేగవంతమైన ఫైఫ్ వికెట్ల ప్రదర్శనగా నిలిచింది.
ముఖ్యంగా, ఇది స్టార్క్ కెరీర్‌లో 100వ టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. రెండో ఇన్నింగ్స్‌లో ఆయన వేసిన 7.3 ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లోనే తన 400 టెస్ట్ వికెట్లు పూర్తి చేశాడు. ఈ క్రమంలో 1947లో ఎర్నీ తోషాక్ నెలకొల్పిన 19 బంతుల్లో 5 వికెట్ల రికార్డును అధిగమించాడు.
వికెట్ల హడావిడి ఇలా సాగింది…
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో తొలి బంతికే వికెట్ తీశాడు స్టార్క్. ఆ ఓవర్ చివరి రెండు బంతులకూ వికెట్లు తీసాడు. రెండో ఓవర్‌ను మెయిడిన్ వేసిన ఆయన, మూడో ఓవర్‌లో మొదటి, మూడో బంతులకూ వికెట్లు తీసి ‘ఫైఫర్’ (Fifer) నమోదు చేశాడు. రెండు సార్లు హ్యాట్రిక్ అవకాశాన్ని మిస్ అయినప్పటికీ, ఎనిమిదవ ఓవర్‌లో మరో వికెట్ తీసి 6 వికెట్ల haul పూర్తిచేశాడు.
ఈ అద్భుత ప్రదర్శనతో స్టార్క్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
పింక్ బాల్ స్పెషలిస్ట్‌గా స్టార్క్…
డే-నైట్ టెస్ట్‌లలో స్టార్క్ ప్రదర్శన శ్రేష్ఠంగా ఉంది. ఇప్పటివరకు పింక్ బాల్‌తో 14 టెస్ట్‌లు ఆడి, 17.08 సగటుతో 81 వికెట్లు తీసుకున్నాడు. ఈ ఫార్మాట్‌లో ఇప్పటికే 5 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.
ప్రస్తుతం 35 ఏళ్ల వయసున్న మిచెల్ స్టార్క్, టెస్ట్ కెరీర్‌లో 100 మ్యాచ్‌లు ఆడి 402 వికెట్లు తీసాడు. అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ 6/9 కాగా, మొత్తం 16 సార్లు ఐదు వికెట్లు తీశాడు.