యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ స్థలమైన తెలంగాణ (Telangana) లోని 13వ శతాబ్దానికి చెందిన రామప్ప ఆలయం (Ramappa Temple) లో అందాల భామలు (Beauty Queens) సందడి చేశారు. 72వ మిస్ వరల్డ్ 2025 పోటీదారులు బుధవారం రామప్ప ఆలయాన్ని సందర్శించారు. తెలంగాణ సంస్కృతి, ఆతిథ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ (Divakar T.S.), ఎస్పీ శబరీష్ (Shabarish) నేతృత్వంలో సుందరీమణులకు తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం లభించింది.
సాయంత్రం 4:30 గంటలకు రామప్ప ఆలయం వద్దకు చేరుకున్న 35 మంది మిస్ వరల్డ్ పోటీదారులను కూచిపూడి, పేరిణి నాట్యం, గిరిజన నృత్య ప్రదర్శనలతో ఆహ్వానించారు, రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ సాంస్కృతిక కార్యక్రమాలు పోటీదారులను ఆకట్టుకున్నాయి. తెలంగాణ టూరిజం శాఖ ఏర్పాటు చేసిన గైడ్‌లు రామప్ప ఆలయం చారిత్రక విశిష్టతను వివరించారు. కాకతీయ శైలి స్థాపత్య కళాఖండంగా దీని ప్రాముఖ్యతను హైలైట్ చేశారు.
సందర్శనలో భాగంగా, మిస్ వరల్డ్ పోటీదారులు సాంప్రదాయ దుస్తుల్లో ఆలయం నేపథ్యంలో గ్రూప్ ఫోటో షూట్‌లో పాల్గొన్నారు, ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మిస్ ఇండియా నందిని గుప్తా సహా పోటీదారులు రామప్ప ఆలయ అద్భుతమైన నిర్మాణాన్ని ప్రశంసించారు. దీనిని తెలంగాణ వారసత్వ సంపదగా అభివర్ణించారు. తెలంగాణ టూరిజం శాఖ ఈ సందర్శనను కాకతీయ వారసత్వ టూర్‌లో భాగంగా నిర్వహించింది. జిల్లా అధికారులు, పోలీసు శాఖ సంయుక్తంగా భద్రతా ఏర్పాట్లు, సౌకర్యాలను పర్యవేక్షించారు.
రామప్ప ఆలయాన్ని సందర్శించిన 72వ మిస్ వరల్డ్ పోటీదారులు
— Telugu Feed (@Telugufeedsite) May 14, 2025
తెలంగాణ సాంప్రదాయ చేనేత చీరలు ధరించిన విశ్వసుందరీమణులు
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయంలో సందడి #Hyderabad #MissWorld2025 #MissWorld #Telangana #Mulugu #RamappaTemple pic.twitter.com/USc6UO4HWo