‘మిరాయ్’ పార్ట్ 2 టైటిల్ ఇదే.. విలన్‌గా స్టార్ హీరో!

'మిరాయ్' పార్ట్ 2 టైటిల్ ఇదే.. విలన్‌గా స్టార్ హీరో!

‘హనుమాన్’ (Hanuman) సినిమాతో తేజ సజ్జా (Teja Sajja) ఒక్కసారిగా పాన్-ఇండియా హీరోగా ఎదిగాడు. ఆ తర్వాత ‘ఈగల్’ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వంలో ‘మిరాయ్’ (Mirai)  అనే మరో పాన్-ఇండియా సినిమా చేశాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో తేజ ఒక యోధుడిగా కనిపించాడు. మంచు మనోజ్ విలన్‌గా నటించడం కూడా ఈ సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చింది. ట్రైలర్‌తోనే సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘మిరాయ్’ సినిమా ఉదయం ఆట నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకెళ్తోంది. ‘సూపర్ యోధ’గా తేజ అద్భుతంగా నటించాడు. సినిమా ముగింపులో ‘మిరాయ్’ సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించారు.

పార్ట్ 2కు ‘మిరాయ్: జైత్రయా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సీక్వెల్‌లో విలన్‌గా రానా దగ్గుబాటి కనిపించనున్నారు. అయితే, ఈ సీక్వెల్ ఎప్పుడు ప్రారంభమవుతుందో చూడాలి. ఎందుకంటే తేజ సజ్జా ప్రస్తుతం ‘హనుమాన్’ సీక్వెల్ అయిన ‘జై హనుమాన్’లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. అలాగే, ‘జాంబి రెడ్డి’ సీక్వెల్‌గా ఇటీవల ప్రకటించిన ‘జాంబి రెడ్డి 2’ కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. తేజ మొదట ‘జై హనుమాన్’ మరియు ‘జాంబి రెడ్డి 2’ సినిమాలను పూర్తి చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలో ‘మిరాయ్’ పార్ట్ 2 ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు విడుదలవుతుందో వేచి చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment