ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై కాంగ్రెస్ నేతలు విమర్శల బాణాలు ఎక్కువపెట్టారు. నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం ప్రసంగం తరువాత అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ వివరణ ఇచ్చారు. తన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రేవతి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చానని, శ్రీతేజ్‌కు అయ్యే పూర్తి వైద్య ఖర్చు తానే భరిస్తానని పునరుద్ఘాటించారు.
కాగా, అల్లు అర్జున్‌పై సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శలు చేశారు. అర్జున్ సీఎం రేవంత్‌రెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తన ఇమేజ్ దెబ్బతీశారంటూ సీఎం వ్యాఖ్యలపై ఎదురుదాడిగా మాట్లాడటం సరికాదన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు లీగల్ టీమ్ ఒప్పుకోలేదని చెప్పడం హాస్యాస్పదం అన్నారు.
అదే విధంగా అల్లు అర్జున్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రజలను ధైర్యం చెబుతూ చేసిన ప్రసంగానికి తరువాత, అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి దుర్ఘటనల సమయంలో అందరితో సానుభూతి చూపడం కీలకమని వెంకట్ అన్నారు. కానీ, అల్లు అర్జున్ మాటలు ప్రజల హృదయాలను గాయపరిచాయని, ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.







